Apple iPhone 15 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో న్యూ జనరేషన్ యాపిల్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు యాపిల్ ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. ఈ కొత్త ఫోన్లు విడుదలై 24 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరు ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫోన్ డెలివరీ కాస్త ఆలస్యం (iPhone Delivery Delayed) అవుతుందని చెప్పినందుకు స్టోర్ సిబ్బందిపై ఇద్దరు కస్టమర్లు దాడికి దిగారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ముందుగా స్టోర్‌లోకి ప్రవేశించిన ఇద్దరు కస్టమర్లు అక్కడున్న సిబ్బందిపై దాడికి దిగుతారు. స్టోర్‌లోని ఇతర సిబ్బంది వారిని ఎంత నిలువరించేందుకు ప్రయత్నించినా వారు వినరు. స్టోర్‌లోని సిబ్బందిని దారుణంగా కొట్టసాగుతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఘటనపై స్టోర్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్టోర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు సదరు కస్టమర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో పోల్చితే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు కీలక అప్ గ్రేడ్స్ చేసింది ఆపిల్. 48 మెగా పిక్సెల్ కెమెరా, యూఎస్బీ-సీ పోర్టు, కొత్త చిప్ సెట్, డైనమిక్ ఐలాండ్ తో పాటు మరిన్ని మార్పులు చేసింది. లుక్ కాస్త సేమ్ కన్పిస్తున్నా, ఫీచర్లు, పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఇంకా బెటర్ గా ఉన్నట్లు తెలిసింది.
ఇక ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ బేస్ స్టోరేజీ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభం కానుండగా, 15 ప్రొ మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది.
#WATCH | Delhi Police took legal action against the customers after a scuffle broke out between customers and mobile shop employees after an alleged delay in supplying iPhone 15 to him in the Kamla Nagar area of Delhi
(Viral Video Confirmed by Police) pic.twitter.com/as6BETE3AL
— ANI (@ANI) September 23, 2023
Also Read..
Vivek Ramaswamy | వివేక్రామస్వామితో డిన్నర్.. ఒక్కొక్కరి నుంచి 50వేల డాలర్లకుపైనే వసూలు..!
Justin Trudeau | భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. అమెరికా మొగ్గు ఎవరివైపంటే..?