Intel | ఇంటెల్ కీలక నిర్ణయం.. లేఆఫ్స్‌కు బదులు జీతాల్లో కోత..!
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.
Intel | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. అయితే మరో టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ (Intel) అన్ని కంపెనీల కంటే వినూత్నంగా ఆలోచించింది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఇంటెల్ తెలిపింది.
ఇంటెల్ తాజా నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న ఈ తరుణంలో.. ఇంటెల్ భిన్నంగా ఆలోచించడాన్ని నిపుణులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనం కొంత తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనంటూ చెప్పుకుంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

