న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటాదారులకు శుభవార్తను అందించింది. 1:1 రేషియోతో షేరు హోల్డర్లకు బోనస్ షేరును అందించడానికి సోమవారం సమావేశమైన కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది.
ఇందుకోసం సంస్థ రూ.6,325 కోట్ల చెల్లింపులు జరుపనున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ మరొక షేరు ఉచితంగా లభించనున్నది. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 96.5 శాతం వాటా కలిగివున్నది. మే 2022లో 3.5 శాతం వాటాను ఐపీవో ద్వారా ప్రభుత్వం విక్రయించడంతో రూ.21 వేల కోట్లు సమకూరాయి.