e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home బిజినెస్ హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా

హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా

హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా
  • డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ

హైదరాబాద్‌, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ ఇన్‌స్పిరా ఎంటర్‌ప్రైజెస్‌.. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఇది సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌గా, డాటా అనలిటిక్స్‌ యూనిట్‌గా సేవలందిస్తుందని సంస్థ డైరెక్టర్‌ విశాల్‌ జైన్‌ బుధవారం తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. మరోవైపు దేశంలోనే బలమైన మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మేము అనేక లావాదేవీలు నిర్వహించాం. ఫార్మా రంగంలోనే అనేక సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. ఈ నగరంలో ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే మేము హైదరాబాద్‌ను నమ్మకమైన గమ్యస్థానంగా ఎంచుకున్నాం. మొదట 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తాం. తర్వాత వెయ్యికి పెంచుతాం’ అని విశాల్‌ జైన్‌ పేర్కొన్నారు. 12 ఏండ్ల అనుభవం కలిగిన ఇన్‌స్పిరాకు.. అమెరికాతోపాటు సింగపూర్‌, శ్రీలంక, దుబాయ్‌ తదితర దేశాల్లో 750కిపైగా క్లయింట్లున్నారు. క్లౌడ్‌, బిగ్‌ డాటా వంటి టెక్నాలజీలను వినియోగిస్తూ.. బ్యాంకింగ్‌, హెల్త్‌ కేర్‌, ఈ-కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ తదితర రంగాలకు సేవలు అందిస్తున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా
హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా
హైదరాబాద్‌లో ఇన్‌స్పిరా

ట్రెండింగ్‌

Advertisement