ముంబై, ఫిబ్రవరి 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలకు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 32.11 పాయింట్లు నష్టపోయి 76,138.93 పాయింట్లకు జారుకోగా, నిఫ్టీ 13.85 పాయింట్లు కోల్పోయి 23,031.40 వద్ద నిలిచింది. బ్లూచిప్ సంస్థలైన అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, నెస్లె, టైటాన్ షేర్లు నష్టపోగా..సన్‌ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటోలు పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్‌గ్యాస్ రంగ సూచీలు నష్టపోగా..హెల్త్‌కేర్, మెటల్, ఆర్థిక సేవలు, కమోడిటీస్, టెలికం, పవర్, రియల్టీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.