ముంబై, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 247.01 పాయింట్లు కోల్పోయి 82,253.46 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 67.55 పాయింట్లు కోల్పోయి 25,082.30 వద్ద స్థిరపడింది.