Indian Gamers | గేమర్స్ జాబితాలో రెండో స్థానంలో భారత్.. దాదాపు 40 కోట్ల మందితో రికార్డు
ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే 50.2 శాతం గేమర్స్ ఇండియాలోనే
Indian Gamers : ఆసియాలో ఎక్కువ మంది గేమర్స్ ఉన్న రెండో దేశంగా భారత్ రికార్డు సాధించింది ప్రపంచంలో ఎక్కువ మంది గేమర్స్‌తో చైనా మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల కోట్ల (దాదాపు 40 కోట్లు) గేమర్స్ ఉన్నారని గేమ్స్ మార్కెట్‌కు చెందిన ‘నికో పార్ట్నర్స్’ అనే కంపెనీ వెల్లడించింది. ఈమధ్యే ‘ది ఆసియా 10 గేమ్స్ మార్కెట్’ పేరుతో ఈ కంపెనీ ఒక రిపోర్టు తయారుచేసింది. అందులో.. ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే 50.2 శాతం గేమర్స్ ఇండియాలోనే ఉన్నారని, భారతదేశానికి చెందిన గేమర్స్ వారానికి సగటున 14 గంటలు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడతారని తెలిపింది.
గత ఐదేళ్లలో భారత్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఆదాయం సంపాదించేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే అని ఈ నివేదిక పేర్కొంది. అంతేకాదు ఈ ఏడాది పర్సనల్ కంప్యూటర్, మొబైల్ గేమ్ మార్కెట్‌కు 35.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నికో పార్ట్నర్స్ తెలిపింది.
చైనా తర్వాత భారత్, థాయ్‌లాండ్, ఫిలీప్పీన్స్ వంటి దేశాల్లో గేమర్స్ సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక చెప్పింది. ఆసియాలోని పది దేశాల్లో జపాన్, కొరియాలు 77 శాతం మార్కెట్ ఉందని నికో పార్ట్నర్స్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

