సోమవారం 01 మార్చి 2021
Business - Feb 21, 2021 , 17:16:53

కార్లపై హ్యుండాయ్ బెనిఫిట్ల వ‌ర్షం.. స్పెష‌లాఫ‌ర్లు కూడా!

కార్లపై హ్యుండాయ్ బెనిఫిట్ల వ‌ర్షం.. స్పెష‌లాఫ‌ర్లు కూడా!

న్యూఢిల్లీ: ‌మీరు న్యూ మోడ‌ల్ కారు కొనుగోలు చేయాల‌ని భావిస్తున్నారా?!  ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు త‌మ సేల్స్ పెంచుకోవ‌డానికి కొత్త కార్ల కొనుగోలుదారుల‌కు బెనిఫిట్లు అంద‌జేస్తున్నాయి. ఆ జాబితాలో ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ ఇండియా కూడా చేరిపోయింది. 


ఐకానిక్ హ్యాచ్‌బ్యాక్ కంపాక్ట్ మోడ‌ల్ శాంత్రో మొద‌లు ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కోనా వ‌రకు రూ.1.50 ల‌క్ష‌ల రూపేణా బెనిఫిట్లు ఆఫ‌ర్ చేస్తోంది హ్యుండాయ్ ఇండియా. అయితే, ఈ ఆఫ‌ర్లు ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కే వ‌ర్తిస్తాయ‌ని కూడా హ్యుండాయ్ పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి 28 త‌ర్వాత వివిధ మోడ‌ల్ కార్ల నిల్వ‌ల‌ను బ‌ట్టి స‌ద‌రు బెనిఫిట్ల‌కు తెర దించ‌డం గానీ, పొడిగించ‌డం గానీ చేయొచ్చు. 


అద‌నంగా ప్ర‌భుత్వోద్యోగుల‌కు రూ.8000 మేర‌కు ప్ర‌త్యేకంగా ఎల్టీసీ బెనిఫిట్‌ను కూడా ప్ర‌త్యేకంగా అందిస్తోంది. మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌తోపాటు ఎంపిక చేసిన కార్పొరేట్ సంస్థ‌ల ఉద్యోగులు, ఎస్ఎంఈలు, టీచ‌ర్లు, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల (సీఏ)కూ స్పెష‌ల్ ఆఫ‌ర్లు వ‌ర్తిస్తాయి. 


శాంత్రో మోడ‌ల్ కారుపై రూ.50 వేల క్యాష్ బెనిఫిట్లు క‌ల్పిస్తున్న హ్యుండాయ్‌.. హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ 10 నియోస్ కారుపై రాయితీ రూ.60 వేల వ‌ర‌కు ఉంది. ఈ ఆఫ‌ర్లు డీజిల్‌, పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కార్ల‌పైనా ల‌భిస్తున్నాయి. ఇక ఔరాపై రూ.70 వేల మేర‌కు ఆఫ‌ర్ అందుబాటులో ఉంది. 


మిడ్‌సైజ్ సెడాన్ ఎలంత్రాపై రూ.ల‌క్ష వ‌ర‌కు బెనిఫిట్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్ వ‌ర్ష‌న్ మోడ‌ల్స్ మీద ప్ర‌త్యేక ధ‌ర‌లు కూడా వినియోగ‌దారుల‌కు చేరువ‌లో ఉన్నాయి. ఇక హ్యుండాయ్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారు కోనాపై గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కొనుగోలుదారుల‌కు ఆదా అవుతాయి. 


హ్యుండాయ్ బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ కార్లు ఐ20, క్రెటా, వెన్యూ, వెర్నా, ట‌స్క‌న్‌ల‌కు ఈ ఆఫ‌ర్లు వ‌ర్తింప‌జేయ‌డం లేదు. ఇక ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్న కార్ల కొనుగోలుపై ఒక డీల‌ర్ నుంచి మ‌రో డీల‌ర్ వ‌ర‌కు బెనిఫిట్ల‌లో తేడా కూడా ఉంటుంది. కార్ల కొనుగోలు దారులు స‌మీపంలోని డీల‌ర్‌ను క‌లిసి ఆయా మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు తెలుసుకుని ముందుకెళితే మంచిద‌ని హ్యుండాయ్ చెబుతోంది. 


వ‌చ్చే నాలుగేండ్ల‌లో భార‌త‌దేశంలో కంపెనీ విస్త‌ర‌ణ‌, నూత‌న మోడ‌ల్ కార్ల ఆవిష్క‌ర‌ణ కోసం రూ.3,200 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. న్యూ స్ట్రాట‌ర్జీతో నూత‌న ఎల‌క్ట్రిక్ కార్ల‌ను తీసుకు రావాల‌ని త‌ల‌పోస్తోంది. కాలుష్య నియంత్ర‌ణ‌కు గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించాల‌న్న వ్యూహంతో హ్యుండాయ్ ఇండియా ముందుకు సాగుతున్న‌ది. ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్‌లో 17 శాతానికి పైగా హ్యుండాయ్ కార్లు అమ్ముడ‌వుతున్నాయి. స‌మీప భ‌విష్య‌త్‌లో ఎల‌క్ట్రిక్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరుగుతుంద‌ని హ్యుండాయ్ న‌మ్ముతోంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo