బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Oct 02, 2020 , 02:02:46

ఈ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు

ఈ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నెలలో దాదాపు సగం రోజులు పనిచేయవు. వివిధ రకాల సెలవుల వల్ల ఏకంగా 14 రోజులు మూతపడనున్నాయి. వీటిలో నాలుగు ఆదివారాలతోపాటు రెండవ, నాలుగవ శనివారాలు, వివిధ పండుగలకు సంబంధించిన సెలవులు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులను మూసివేస్తారు. అక్టోబర్‌లో గాంధీ జయంతితోపాటు మహాసప్తమి, దసరా, మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాల సందర్భంగా బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. వీటితోపాటు ఈ నెలలో పలు ప్రాంతీయ పండుగలు కూడా ఉండటంతో రాష్ర్టాలను బట్టి ఆ సెలవులు లభిస్తాయి. అన్ని రాష్ర్టాలకు వర్తించే సెలవుల్లో అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి), అక్టోబర్‌ 4, 11, 18, 25 (ఆదివారాలు), అక్టోబర్‌ 10 (రెండో శనివారం) ఉన్నాయి. వీటితోపాటు మహాసప్తమి (అక్టోబర్‌ 23, 24), మిలాద్‌ ఉన్‌ నబీ (అక్టోబర్‌ 30) పర్వదినాల సందర్భంగా చాలా రాష్ర్టాల్లోని బ్యాంకులకు సెలవులు లభిస్తాయి. అలాగే ప్రాంతీయ పర్వదినాలైన చెల్లం (అక్టోబర్‌ 8), కటి బిహు (అక్టోబర్‌ 17), మిలాద్‌ ఈ షరీఫ్‌ (అక్టోబర్‌ 29)తోపాటు మహర్షి వాల్మీకి జయంతి, సర్దార్‌ పటేల్‌ జయంతి (అక్టోబర్‌ 31) సందర్భంగా కొన్ని రాష్ర్టాల్లోని బ్యాంకులు పనిచేయవు.logo