Godrej on Division | గోద్రేజ్ ఫ్యామిలీలో చీలిక.. విభజన దిశగా గ్రూప్?!
Godrej on Division | గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోనున్నది. ఆదిగోద్రేజ్, నాదిర్గోద్రేజ్, జమ్షెడ్, స్మిత భాగస్వాములుగా ఉన్నారు.

Godrej on Division | సబ్బులు.. గృహోపకరణాలు మొదలు రియల్ ఎస్టేట్ రంగం వరకు పలు రంగాల్లో సేవలందిస్తున్న పారిశ్రామిక సంస్థ గోద్రేజ్ రెండుగా విడిపోనున్నదని వార్తలొచ్చాయి. 124 ఏండ్లుగా ఉమ్మడిగా వ్యవహరించిన గోద్రేజ్ గ్రూప్ కుటుంబంలో చీలిక నేపథ్యంలో దాని అనుబంధ పరిశ్రమలు కూడా విడిపోనున్నాయని కథనం.

రెండు గ్రూపులుగా గోద్రేజ్ విభజన?
గోద్రేజ్ గ్రూప్ పూర్తిస్థాయిలో రెండు విభిన్న గ్రూప్‌లుగా విడిపోనున్నదని ఆ వార్తా కథనం సారాంశం. కొన్నేండ్లుగా వాటాదారులకు మెరుగైన లాభాలు అందించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తూ వచ్చిందని గోద్రేజ్ కుటుంబం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపింది.

పూర్తి వివరాలు వెల్లడించని గోద్రేజ్ ఫ్యామిలీ
విభజన ప్రణాళికలేవీ గోద్రేజ్ కుటుంబం బయటపెట్టలేదు. కానీ ఈ ప్రక్రియలో భాగంగా విభజన కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై తమ ఎక్స్టర్నల్ పార్టనర్స్ సలహాలు కోరాం. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

బ్యాంకర్లు, న్యాయ సలహా కోసం ఇలా..
నీమేశ్ కంపానీ, ఉదయ్ కొటక్ వంటి బ్యాంకర్లు, జియా మోడీ ఆఫ్ ఏజడ్బీ అండ్ పార్టనర్స్, సిరిల్ షరాఫ్ వంటి న్యాయ సంస్థల్లోని మా కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ప్రముఖులతో విభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం అని తెలిపింది.

విభజనలో గోద్రేజ్ ఫ్యామిలీ ఇలా..
4.1 బిలియన్ డాలర్ల విలువ గల గోద్రేజ్ గ్రూప్‌కు ఆది గోద్రేజ్ చైర్మన్‌గా ఉన్నారు. ఆది గోద్రేజ్తోపాటు గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆది గోద్రేజ్ సోదరుడు నాదిర్ గోద్రేజ్ మధ్య ఈ పరిశ్రమలు విడిపోనున్నాయి. వీరిద్దరితోపాటు కజిన్ జమ్షెడ్ ఎన్ గోద్రేజ్, సోదరి స్మితా గోద్రేజ్ క్రిష్ణ కూడా ఈ విభజనలో భాగం కానున్నారు.

ట్రస్టులకు 23 శాతం వాటా
భారతదేశంలోని పాతకాలం నాటి బిజినెస్ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న గోద్రేజ్ కుటుంబ సభ్యుడు జమ్షెడ్ ఎన్ గోద్రేజ్.. గోద్రేజ్ అండ్ బయోస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి సారధ్యం వహిస్తున్నారు. తమ గ్రూప్‌లో 23 శాతం పర్యావరణం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సేవలందించడానికి ఏర్పాటైన ట్రస్ట్‌లకు చెందుతుందని గోద్రేజ్ వర్గాలు తెలిపాయి.

విభజనలో ఈ సంస్థలు భాగం..
అన్ లిస్టెడ్ ఇంజినీరింగ్ సంస్థ గోద్రేజ్ అండ్ బయోస్ మాన్యుఫాక్చరింగ్ కో లిమిటెడ్‌తోపాటు లిస్టెడ్ సంస్థలు గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ అగ్రొవెట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లను విభజనలో చేర్చారు. అర్దెశిర్ గోద్రేజ్ 1897లో గోద్రేజ్ గ్రూప్‌ను స్థాపించారు. పలు విఫల వెంచర్ల తర్వాత గోద్రేజ్ గ్రూప్ లాభాల బాట పట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

