Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Woman Delivers Baby On Bus | కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించిన నిండు గర్భిణీ అయిన మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సహకరించడంతో ఆ బస్సులోనే ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
గువాహటి: కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించిన నిండు గర్భిణీ అయిన మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సహకరించడంతో ఆ బస్సులోనే ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. (Woman Delivers Baby On Bus) అస్సాంలో ఈ సంఘటన జరిగింది. నిండు గర్భిణీ అయిన మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతి నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న బస్సులో ప్రయాణమైంది. మార్గమధ్యలో ఆ మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆమెకు ప్రసవం కాబోతోందని తెలుసుకున్న ప్రయాణికులు డ్రైవర్‌ను అలెర్ట్ చేయగా రోడ్డు పక్కన బస్సును ఆపాడు.
కాగా, బస్సులోని మగ ప్రయాణికులంతా కిందకు దిగారు. కొందరు మహిళలు దుప్పట్లు, బట్టలతో బస్సులో ఒక తాత్కాలిక గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళ కాన్పు కోసం వారు సహకరించారు. దీంతో ఆడ బిడ్డను ఆమె ప్రసవించింది.
మరోవైపు డ్రైవర్, ఇతర ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ అక్కడకు చేరుకోగా తల్లి, నవజాత శిశువును సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు యజమాని ఆ మహిళ కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

