Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
Oh Na Siddayya | భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
Oh Na Siddayya | భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ పాటను విడుదల చేశారు. అక్టోబర్ 30న శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, 5 వేల మందికి పైగా ప్రేక్షకులు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు ఈ వేడుకను విజయవంతం చేశారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై పాటను లాంచ్ చేయగా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మరో ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పల్లెటూరి నేపథ్యంలో భార్యాభర్తల ప్రేమానుబంధం, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ పాటను సిద్ధు రెడ్డి కందకట్ల నిర్మించగా, సిద్ధయ్య పాత్రలో నటించారు. ఈ వేడుక కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు మరియు కార్మికులకు హెల్మెట్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో మరింత ఆదర్శంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

