IRCTC HDFC Bank Credit Card | దేశంలోని సబర్బన్ ప్రాంతాల్లో నివసిస్తూ సమీప పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేసే వారికి, నిత్యం రైలు ప్రయాణం చేసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి రైల్వే టికెట్ల ఆన్లైన్ రిజర్వేషన్ల సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ -IRCTC) కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డు- ఐఆర్సీటీసీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు (IRCTC HDFC Bank Credit Card) తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్వర్క్ ఆధారంగా పని చేస్తుంది. దీంతో రైల్వే టికెట్ల బుకింగ్‌పై డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు ఇతర బెనిఫిట్లు పొందొచ్చు. ఆసక్తి కల వారు హెచ్డీఎఫ్సీ, ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖలకు వెళ్లి కూడా అప్లయ్ చేయవచ్చు. ఈ ఐఆర్సీటీసీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ ద్వారా బుకింగ్స్‌పై ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్లు అందుబాటులోకి వచ్చాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ లావాదేవీలు చేయలేకపోతున్నట్లు పలువురు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూజర్లు ట్విట్టర్లో ఫిర్యాదులు చేసిన దరిమిలా.. ఐఆర్సీటీసీతో కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇంతకుముందు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లతో కలిసి ఐఆర్సీటీసీ ఇదే తరహా కో – బ్రాండెడ్ కార్డులను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.