GST Collections | జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2,01,050 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వశాఖ డేటా పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే 16.4శాతం ఎక్కువ. ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి రూ.2.37లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు రూ.2.37 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా మే మాసంలోనూ రూ.2లక్షల కోట్ల మార్క్‌ని దాటడం విశేషం. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ 2024లో జీఎస్టీ వసూళ్లు రూ.2.10లక్షల కోట్లు. జులై ఒకటి 2017 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండోసారి అత్యధికంగా వసూలయ్యాయి. మార్చి 2025లో జీఎస్టీ వసూళ్లు రూ.1.96లక్షలు కాగా.. మార్చి నెలలో 9.9శాతం పెరుగుదల నమోదైంది.
Read Also : Bank Holidays in June | జూన్‌లో బ్యాంకులు 12 రోజులు బంద్..! ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..?
మార్చిలో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ ఆదాయం 8.8శాతం పెరిగి రూ.1.49లక్షలకు చేరుకోగా.. దిగుమతి చేసుకున్న వస్తువల నుంచి వచ్చే ఆదాయం 13.56శాతం పెరిగి రూ.46,919 కోట్లకు చేరుకున్నాయి. దేశీయ, దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి వచ్చే ఆదాయం 13.7శాతం పెరిగి దాదాపు రూ.1.50లక్షల కోట్లకు చేరుకున్నది. అదే సమయంలో దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 25.2శాతం పెరిగి రూ.51,266 కోట్లకు చేరాయి. అదే సమయంలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నది. ఇది గత సంవత్సరం మే నెలలో కంటే 20.4శాతం ఎక్కువ. అదే సమయంలో ఇక మొత్తం రీఫండ్ 2025 మే నెలలో 4శాతం తగ్గి రూ.27,210 కోట్లకు చేరింది. కేంద్ర జీఎస్టీ (CGST) రూ.35,434 కోట్లు కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST) రూ.43.902 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) దాదాపు రూ.1.09 లక్షల కోట్లు (ఇందులో రూ.44,735కోట్లు దిగుమతులపై), సెస్ రూ.12,879 కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే మే 2024లో జీఎస్టీ వసూళ్లు రూ.1.72లక్షల కోట్లు.
Read Also : June 1st New Rules | వినియోగదారులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్
ఈ సంవత్సరం మేలో రూ.2.10లక్షల కోట్లకుపైగా పెరిగింది. జీఎస్టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా వృద్ధి కనిపించినా.. రాష్ట్రాలవారీగా గణనీయమైన తేడాలున్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు తదితర కీలక రాష్ట్రాలు 17 శాతం నుంచి 25 శాతం వరకు వృద్ధి నమోదయ్యాయి. అయితే, తెలంగాణ, ఏపీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఆరుశాతం వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుండగా.. మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర ఇతర రాష్ట్రాలు 10 శాతం వరకు వృద్ధి నమోదైంది. కాలానుగుణ ప్రభావం, లేదంటే రంగాల ఆధారిత కారణాలు ఉండవచ్చని.. దీనికి వివరణాత్మక డేటా విశ్లేషణ అవసరమన్నారు.