Bank Holidays in June | జూన్ మాసంలో పది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులు, ప్రత్యేక రోజులు, పండుగలు కలుపుకొని 12 రోజుల సెలవులు రానున్నాయి.
బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటితో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలున్నది. పలుసేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
జూన్ 1 : ఆదివారం సందర్భంగా హాలీడే.
జూన్ 6 : బక్రీద్ నేథ్యంలో కేరళలో బ్యాంకులకు హాలీడే.
జూన్ 7 : బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. గుజరాత్, సిక్కి, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్యాంకులు ఓపెన్.
జూన్ 8 : ఆదివారం సందర్భంగా సెలవు.
జూన్ 11 : సంత్ కబీర్ జయంతి. సిక్కిం, మేఘాలయలో బ్యాంకులు బంద్.
జూన్ 14 : రెండోశనివారం సందర్భంగా హాలీడే.
జూన్ 15 : ఆదివారం సందర్భంగా సెలవు.
జూన్ 22 : ఆదివారం సందర్భంగా హాలీడే.
జూన్ 27 : జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిశా, మణిపూర్‌లో సెలవులు.
జూన్ 28 : నాల్గో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
జూన్ 29 : ఆదివారం సందర్భంగా హాలీడే.
జూన్ 30 : శాంతి దినోత్సవం సందర్భంగా మిజోరాంలో హాలీడే.
June 1st New Rules | వినియోగదారులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్