Tesla Import Duty Tussle | అమెరికా కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్న టెస్లా ఇంక్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడానికి టెస్లాకు కేంద్రం రెండు షరతులు విధించినట్లు సమాచారం. అందులో భాగంగా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ (సీబీయూ) రూట్లో కార్లను విక్రయిస్తే దిగుమతి సుంకం తగ్గించేందుకు సిద్ధమని కేంద్ర సర్కార్ సంకేతాలిచ్చింది. అలాగే కార్ల విడి భాగాలను దేశీయంగా సమకూర్చుకుని ఉత్పత్తి చేపట్టాలని.. దేశంలో ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటుపై సంస్థ యాజమాన్యం ప్రణాళికలను సమర్పించాలని టెస్లాను కోరింది కేంద్ర భారీ పరిశ్రమలశాఖ.
సీబీయూ రూట్లో కార్ల తయారీ- విక్రయం, దేశీయంగా విడి భాగాలను సమకూర్చుకోవడంతోపాటు స్థానికంగా ఉత్పత్తి ప్రారంభంపై టెస్లా ఇచ్చే ప్రణాళికను బట్టి దానిపై దిగుమతి సుంకాల తగ్గింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పూర్తి స్థాయిలో కారు దిగుమతి చేసుకోవడం కంటే భాగాలుగా దిగుమతి చేసుకుని నిర్మిస్తే సుంకం తగ్గుతుందని టెస్లా ద్రుష్టికి కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలశాఖ అధికారులు తెచ్చారు.
ముందుగా భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయం ప్రారంభించాలని టెస్లా ప్రణాళిక రూపొందించింది. కానీ దిగుమతి కార్లపై భారీగా సుంకాలు విధించడంతో టెస్లా వెనుకడుగు వేసింది. 40 వేల డాలర్ల విలువైన ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 60 శాతం, అంతకు మించితే 100 శాతం సుంకం విధిస్తున్నది కేంద్రం. ప్రస్తుతం అమలులో ఉన్న 60-100 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని గత నెలలో కేంద్రాన్ని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కోరారు.
ఇప్పటికే భారత్‌లో 100 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను కొనుగోలు చేశామని కేంద్రానికి టెస్లా వివరించింది. పన్ను మినహాయింపులిస్తే ఈ పరిమాణం మరింత పెరుగుతుందన్నది టెస్లా. సేల్స్, సర్వీస్, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో గణనీయ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. టెస్లా వివరణ నేపథ్యంలో సుంకాలను తగ్గించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
Paytm’s IPO | పేటీఎంకు షాక్.. ఐపీవోకు అనుమతి లభిస్తుందా.. ఎందుకంటే?!!
Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Huzurabad | ఈటలకు షాక్.. ‘గెల్లు’కే మా ఓటన్న ముదిరాజ్‌లు
Vinesh Phogat: రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో.. తీవ్ర నిరాశలో వినేష్ ఫోగాట్