Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Electric vehicles | ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈవీలను దేశవ్యాప్తంగా రెండు కంపెనీలు ఒకేసారి లాంచ్ చేయనున్నాయి. ఇందులో ఒకటి ఓలా కంపెనీ కాగా.. మరొకటి సింపుల్ ఎనర్జీ కంపెనీ. ఆటో మొబైల్ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఈ రెండు స్టార్టప్ కంపెనీలు నిరంతర పరిశోధనలు, భవిష్యత్ అవసరాలను గుర్తించి ఈవీలను రూపొందించడం విశేషం. ఇంట్లోనే ఇంధనం నింపుకుని రోడ్లపై పరిగెత్తేలా తయారు చేసి సరికొత్త విప్లవానికి నాంది పలుకనున్నాయి.
కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించి అతితక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇంధన ఖర్చులు మండిపోతుండడంతో వాహనదారుల చూపు ఈవీలవైపు మళ్లుతున్నది. మార్కెట్లో అనేకరకాల ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆటోమోబైల్ రంగంలో ఎలాంటి అనుభవం లేని ఓలా,సింపుల్ ఎనర్జీ అనే రెండు స్టార్టప్ కంపెనీలు నవతర ఈవీలను మార్కెట్లోకి తీసుకరాబోతున్నాయి. పంద్రాగస్టు రోజున ఈ రెండు కంపెనీలు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తయారు చేస్తున్న వాహనాలను విడుదల చేయనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రకటించిన 24 గంటల్లోనే ఆన్లైన్లో రూ.499 చొప్పున చెల్లించి లక్ష వాహనాలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం గమనార్హం.
ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈవీలను దేశవ్యాప్తంగా రెండు కంపెనీలు ఒకేసారి లాంచ్ చేయనున్నాయి. ఇందులో ఒకటి ఓలా కంపెనీ కాగా.. మరొకటి సింపుల్ ఎనర్జీ కంపెనీ. ఆటో మొబైల్ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఈ రెండు స్టార్టప్ కంపెనీలు నిరంతర పరిశోధనలు, భవిష్యత్ అవసరాలను గుర్తించి ఈవీలను రూపొందించడం విశేషం. ఇంట్లోనే ఇంధనం నింపుకుని రోడ్లపై పరిగెత్తేలా తయారు చేసి సరికొత్త విప్లవానికి నాంది పలుకనున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికే ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఆటోమొబైల్ రంగంలో స్టార్టప్ కంపెనీలు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాయి. టెక్నాలజీ అండగా.. గ్రీన్ ఎనర్జే ఇంధనంగా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ రంగంలో ముందెన్నడూ చూడని విప్లవాత్మకమైన ఆవిష్కరణలు కండ్ల ముందు సాక్షాత్కరించనున్నాయి. హేమాహేమీలైన ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు చేయలేని సాహసాన్ని, సరికొత్త ఆవిష్కరణలను స్టార్టప్ కంపెనీలు చేస్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులను సమీకరించి ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం,చార్జింగ్, బూట్ స్పేస్ విషయంలో ఈ రెండు కంపెనీలు పోటీ పడుతున్నాయి.

విపరీతమైన పోటీ
పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఇక భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అన్న సత్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకం నెమ్మదిగా ప్రారంభమైనా ఇక నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ఈవీల తయారీపై దృష్టి సారించాయి. వీటి ధరలు, ఫీచర్లు ఒక దానికి మించి మరొకటి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఈవీల వాడకం పెరిగేలా చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చి రకరకాల ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించి అమలు చేస్తున్నది. తద్వారా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా వాడే అవకాశం లేకపోలేదు. 2030 వరకు రోడ్లపై తిరిగే వాహనాల్లో సగానికి పైగా ఈవీలే ఉండే అవకాశం ఉందని ఆటో మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ పరుగులు..
లీటరు పెట్రోల్‌కు 45 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. అంటే రూ.105లకు వచ్చే లీటర్ పెట్రోల్‌తో ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తే అయ్యే ఖర్చు 2.33 పైసలు. అదే ఎలక్ట్రికల్ వాహనమైతే కిలోమీటరకు 30 పైసల నుంచి 40 పైసల వరకు ఖర్చు అవుతుంది. పైగా ఈ వాహనాలతో కాలుష్యం అన్న మాటే ఉండదు. ఇంధనం కోసం పెట్రోల్ బంక్‌లకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే ఎంచక్కా చార్జింగ్ పెట్టుకోవచ్చు. బయటికి వెళ్లినప్పుడు సైతం చార్జింగ్ చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు సైతం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో చార్జింగ్ సమస్య తీరనున్నది.

24గంటల్లో లక్ష ఈవీల బుకింగ్..
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రకటన ఇచ్చిన 24 గంటల్లో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు బుక్ అయ్యాయి. ఒక్కొక్కరు రూ.499లు చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. ఇది ఒక రికార్డు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఒక వాహనానికి ముందస్తు బుకింగ్ ఈ స్థాయిలో జరగలేదు. ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈ వాహనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణ భారత దేశం నుంచి వస్తున్న ఈ రెండు ఈవీ కంపెనీలు తయారీ కేంద్రాలు మాత్రం తమిళనాడులో ఉన్నాయి.

ఇవీ ప్రత్యేకతలు
ఓలా ఎలక్ట్రిక్
18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. 75 కి.మీ. ప్రయాణించొచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 150 కి.మీ.దూరం వెళ్లొచ్చు. ధర రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు.
సింపుల్ ఎనర్జీ :
3.5 సెకన్లలో 0-50 కిలోమీటర్ పర్ అవర్ (కేఎంపీహెచ్) అందుకోగలదు. ఒకసారి చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 240 కి.మీ. వెళ్లొచ్చు. ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు.
ఓలా విశేషాలు..

- రివర్స్ మోడ్ ఉంటుంది.
- కీ లేకుండా యాప్ ఆధారంగానే స్కూటర్‌ను నడిపే అవకాశం. ఇది ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిది.
- 10 రకాల రంగుల్లో వాహనం లభిస్తుంది.
- ఎస్, ఎస్1, ఎస్1 ప్రో అనే మూడు మోడల్స్ ఉంటాయి.
- తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓలా ఫ్యూచర్ ఫ్యూచర్ ప్యాక్టరీ పేరుతో 500 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రాన్ని రూ.2400 కోట్లతో ఏర్పాటు చేసింది.
- దేశవ్యాప్తంగా 400 నగరాల్లో హైపర్ చార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది.
- బూట్ కెపాసిటీ 50 లీటర్లు.
- 3.9 సెకన్లలో గంటకు 45 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు.
- 18 నిమిషాల్లో 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. 75 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లవచ్చు.చార్జింగ్ చేసుకునేందుకు ఇంట్లో హోం చార్జర్ యూనిట్‌ను అందిస్తారు.రూ.499 లు చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.1000కి పైగా నగరాల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 150 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. బేస్, మిడ్, టాప్ మోడళ్లు ఉన్నాయి. టాప్ మోడల్‌తో గంటకు 100 కిలో మీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ధర రూ. 80,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉంటుందని అంచనా. ఆగస్టు 15న మార్కెట్లోకి రానున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఓసారి లుక్కేయండి!
పంద్రాగస్టుకు మార్కెట్లోకి ఓలా స్కూటర్
Ola Scooter | పది రంగుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400 సిటీల్లో చార్జింగ్ ఫెసిలిటీ..!
Electric Vehicles | పెట్రో ధరల ఎఫెక్ట్.. ఈ- వెహికిల్స్‌కే హైదరాబాదీల ఇంట్రెస్ట్
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

