Ola Scooter | పది రంగుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400 సిటీల్లో చార్జింగ్ ఫెసిలిటీ..!
Ola Scooter | పది రంగుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400 సిటీల్లో చార్జింగ్ ఫెసిలిటీ..! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. కస్టమర్లకు పది రంగుల ఆప్షన్లలో ....

చెన్నై: క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ( Ola Scooter ).. కస్టమర్లకు పది రంగుల ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 15న విపణిలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ వెల్లడించారు. అదే రోజు తమ స్కూటర్లో ఫీచర్లు, స్పెషిపికేషన్లు బహిర్గతం అవుతాయని మంగళవారం ట్వీట్ చేశారు.
పది రంగుల్లోOla Electric Scooter ..
పది రంగుల ఆప్షన్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విపణిలో ఆవిష్కరించేందుకు ఓలా ఎలక్ట్రిక్ సిద్ధం అవుతున్నది. బ్లాక్, వైట్, గ్రే, ఎల్లో, రెడ్, బ్లూ కలర్స్‌తోపాటు వాటి షేడ్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికైతే కంపెనీ అధికారికంగా స్కూటర్ ధర వెల్లడించలేదు. కానీ రూ.85 వేలు పలుకవచ్చునని కొన్ని వార్తలొచ్చాయి.
400 సిటీల్లో చార్జింగ్ పాయింట్లు
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణతోపాటు దాని చార్జింగ్ కోసం 400 సిటీల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది. లక్షకి పైగా ప్రాంతాల్లో హైపర్ చార్జర్ కేంద్రాలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. కనుక చార్జింగ్ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎటువంటి ఇబ్బందుల్లేవు.
సింగిల్ చార్జింగ్‌తో ఇలా
ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీన్ని ఇంటి వద్ద చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా స్కూటర్‌తోపాటు హోం చార్జర్ కూడా ఇస్తారు. రెగ్యులర్ వాల్ సాకెట్‌తో కస్టమర్లు దీన్ని చార్జింగ్ చేసుకోవచ్చు.
కేవలం 18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. అయితే 75 కిలోమీటర్ల రేంజి వరకు ప్రయాణించొచ్చు. ఇంకా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫెసిలిటీ కూడా ఉంది. రెండు హెల్మెట్ల బూట్ స్పేస్ కూడా ఇందులో కల్పించారని తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్‌ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
PAN mandatory | ఈ ఆర్థిక లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 10 colours
- ola electric
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

