Gold Rate | బంగారం ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బులియన్ మార్కెట్లో ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి తులం ధర రూ.98,650కి చేరుకుంది. ఇక వెండి ధర రూ.2,040 పెరిగి కిలోకు రూ.1,01,200కి ఎగిసింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.98,200 చేరింది. అదే సమయంలో స్థానిక మార్కెట్లలో వెండి ధరలు రూ.2,040 పెరిగి రూ.లక్ష మార్క్‌ని అధిగమించింది. ప్రస్తుతం కిలో రూ.1,01,200కి చేరింది. ప్రపంచ బలమైన ధోరణి, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు సైతం స్థానిక ధరల పెరుగుదలకు కారణమని స్థానిక మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన తర్వాత డాలర్ ఒత్తిడికి గురవుతున్నది. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.50శాతం తగ్గి ఔన్స్‌కు 3,298.69 డాలర్లకు చేరింది. యూఎస్ డాలర్ ఇండెక్స్‌లో క్షీణత, యూఎస్ రుణంపై కొత్త ఆందోళనల కారణంగా బంగారం ధరలు సానుకూలంగా టేడ్రవుతున్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ డాలర్ బలహీనపడడం.. కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారన్నారు. యూఎస్, చైనా మధ్య కొత్త ఉద్రిక్తతల మధ్య బంగారం డిమాండ్ పెరుగుతూనే ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.89,750 పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.97,910గా ఉన్నది. కిలో వెండి రూ.1.12లక్షలు పలుకుతున్నది.