Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రికార్డు స్థాయికి ధరలు చేరగా.. ఇటీవల వరుసగా నాలుగు రోజులు తగ్గుతూ వచ్చి ఊరటనిచ్చాయి. తాజాగా బుధవారం మార్కెట్లో ధర మళ్లీ పెరిగింది. రూ.235 పెరిగి తులం ధర రూ.రూ.90,685కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం ఫ్యూరిటీ బంగారం 10 గ్రాములకు రూ.235 పెరిగి రూ.90,235కి చేరింది. ఇటీవలి నష్టాల తర్వాత రిటైలర్లు తాజాగా కొనుగోలు చేయడంతో పసిడి ధరలు పెరిగినట్లుగా వ్యాపారులు పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్ కారణంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ఇక వెండి ధర రూ.1,500 పెరిగి కిలోకు రూ.1,01,500కి చేరింది. మరో వైపు ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.16 శాతం పెరిగి ఔన్సుకు 3,024.96 డాలర్లకు చేరింది.
పెట్టుబడిదారుల డిమాండ్, సురక్షితమైన పెట్టుబడి గోల్డ్‌కి డిమాండ్, ఈటీఎఫ్‌ల నుంచి బలమైన ఇన్‌ఫ్లో కారణంగా బుధవారం బంగారం స్వల్పంగా పెరిగింది. ఇక ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై కొత్త వాణిజ్య విధానాన్ని ప్రకటించనున్నారు. యూఎస్ సుంకాల నిర్ణయంపై అనిశ్చితి కారణంగా బంగారానికి మద్దతు లభిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ (కమోడిటీస్) విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. LKP సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ, రీసెర్చ్ అనలిస్ట్-వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ ఈ వారం చివరలో విడుదలకానున్న యూఎస్ జీడీపీ, కోర్ పర్సనల్ కన్స్యూమ్ ఎక్స్పెన్షన్ (PCE) ప్రైస్ ఇండెక్స్‌తో సహా కీలకమైన స్థూల ఆర్థిక డేటా కోసం మార్కెట్‌కు చెందిన వారంతా ఎదురు చూస్తున్నారన్నారు. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు సైతం విస్తృత ధోరణిని ప్రభావితం చేస్తాయని.. డిమాండ్‌ను పెంచుతుందని త్రివేది పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.81,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.89,400గా ఉన్నది. ఇక కిలో వెండి ధర రూ.1,11,000గా చేరింది.
Survey | భారత్‌ను వీడేందుకే సంపన్నుల ఆసక్తి..! సర్వేలో షాకింగ్ విషయాలు..!
Samsung | శామ్ సంగ్‌కు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఏకంగా రూ.5,154 కోట్ల జరిమానా..!
Tariffs Hike | యూజర్లకు షాక్ ఇవ్వబోతున్న టెలికాం కంపెనీలు.. త్వరలోనే పెరగనున్న రీచార్జ్ ధరలు..!