Tariffs Hike | మొబైల్ రీచార్జ్ ధరలు ప్రియం కానున్నాయి. భవిష్యత్‌లో కంపెనీలు టారిఫ్ ధరలు వరుసగా పెంచనున్నాయి. ఆదాయాన్ని మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు ధరలను సవరించనున్నాయి. కంపెనీలు ఇప్పటికే 2019 డిసెంబర్, 2021 నవంబర్‌తో పాటు పాటు 2024 జులైలో మూడుసార్లు టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. టెలికాం కంపెనీలు యావరేట్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) ను పెంచాలని యోచిస్తున్నాయి. ధరల పెరుగుదల చాలా మంది యూజర్లపై భారం పడనున్నది. అధిక చార్జీల కారణంగా కంపెనీలకు ఆదాయం మరింత సమకూరనున్నది.
అయితే టెలికాం రంగం ప్రస్తుతం క్లిష్టమైన దశలో ఉందని ఓ నివేదిక పేర్కొది. పోటీ తీవ్రత తగ్గిందని.. పెట్టుబడి, కస్టమర్ డేటా వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇండస్ట్రీ రాబడి ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ గతంలో చెప్పింది. ఈ క్రమంలో రాబోయే సంవత్సరాల్లో కంపెనీలు టారిఫ్ ధరలను మరింత పెంచనున్నాయి. ఇదిలా ఉండగా.. స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. ఇందు కోసం ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందం కుర్చుకున్న ఎలాన్ మస్క్ కంపెనీ ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాతోనూ చర్చలు జరుపుతున్నది. తక్కువ బ్రాండ్‌బాండ్ ధరల సేవలకు గుర్తింపు పొందిన స్టార్‌లింక్ మార్కెట్లో నియంత్రణ అడ్డంకులు, హై ఇంపోర్ట్ ట్యాక్స్, కాంపిటేటివ్ ధరల కారణంగా భారత్‌లో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది.
గత ఐదు సంవత్సరాలలో టెలికాం కంపెనీల ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని నివేదిక పేర్కొంది. కంపెనీల ఆదాయం మెరుగుపడుతోంది. నిర్వహణ ఖర్చుల స్థిరీకరణతో పాటు.. మార్జిన్స్ బలపడుతున్నాయి. 5జీ సేవలు వచ్చాక కంపెనీలు తమ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ తగ్గించాయి. నివేదిక ప్రకారం.. 4జీ, 5జీ యూజర్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో 2జీ వినియోగదారుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. రాబోయే ఐదారేళ్లలో ఈ సంఖ్య మరింత తగ్గనున్నది. ప్రస్తుతం 25కోట్ల మంది యూజర్లు 2జీ సేవలను ఉపయోగిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 40శాతం వాటాను కలిగి ఉంది. ఎయిర్‌టెల్‌కు 23శాతం 2జీ కస్టమర్స్ ఉన్నారు.
ప్రస్తుతం 2జీ సేవలకు స్వస్తి చెప్పి యూజర్లు 4జీ వైపు మళ్లుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల సంఖ్య సైతం పెరుగుతూ వస్తున్నది. దాంతో డేటా వినియోగం పెరుగుతోంది. వినియోగదారులు అధిక ధరల డేటా ప్లాన్స్‌ని ఎంచుకుంటున్నారు. ఇక ఇంటర్నేషనల్ రోమింగ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ వంటి సేవలు సైతం గణనీయంగా పెరిగాయి. భారతదేశం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగం విస్తరిస్తోంది. టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్, టెలికమ్యూనికేషన్స్ యాక్ట్-2023 వంటి ప్రభుత్వ చొరవ మద్దతుగా నిలుస్తున్నాయి. ఓపెన్ ఎఫ్‌డీఐ విధానాలు, క్వాంటం శాటిలైట్ టెక్నాలజీలో పురోగతి, VSAT నెట్‌వర్క్‌ల విస్తరణ ఈ రంగంలో ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి.