Survey | దేశానికి సంపన్నులు పలువురు భారత్‌ను వీడి ఇతర దేశాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం 22శాతం మంది సూపర్ రిచ్ ఇండియన్స్ మెరుగైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం తదితర కారణాలతో దేశాన్ని వీళ్లాలని కోరుకుంటున్నట్లుగా ఓ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ సర్వే 150 మంది అల్ట్రా రిచ్ వ్యక్తులు (UHNI)పై నిర్వహించారు. సర్వే ప్రకారం.. ఆయా సంపన్నులంతా గోల్డెన్ వీసా స్కీమ్‌ని దృష్టిలో పెట్టుకొని.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లాంటి దేశాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. దేశానికి చెందిన ప్రముఖ అసెట్ మేనేజర్ కంపెనీ కొటక్.. ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీ ఈవైతో కలిసి సర్వే నిర్వహించింది.
వాస్తవానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రతి సంవత్సరం 25లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా రిచ్ వ్యక్తుల్లో ఒకరు ప్రస్తుతం వలస వెళ్లే పనిలో కొందరు ఉండగా.. మరికొందరు వలస వెళ్లేందుకు యోచిస్తున్నారని సర్వే ఫలితాలు తెలిపాయి. ఇందులో చాలామంది తమ భారతీయ పౌరసత్వాన్ని నిలుపుకుంటూనే.. తమకు నచ్చిన దేశంలో శాశ్వతంగా నివసించాలని కోరుకుంటున్నట్లుగా సర్వే పేర్కొంది. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనశైలిని కోరుకుంటున్నట్లుగా సర్వే పేర్కొంది. మూడింట రెండువంతుల కంటే ఎక్కువ మంది వ్యాపార కార్యకలాపాలు సులభతరం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
వారంతా వలస వెళ్లే నిర్ణయాన్ని ‘భవిష్యత్ పెట్టుబడి’గా అభవర్ణించడంతో పాటు తమ పిల్లలకు మంచి ఉన్నత విద్యను అందించాలనే కోరిక కూడా వలసకు ప్రేరేపిస్తుందని సర్వే నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ గౌతమి గవాంకర్ మాట్లాడుతూ వలస వెళ్లే నిర్ణయాన్ని దేశం నుంచి బయటకు వెళ్లే మూలధనంగా చూడొద్దన్నారు. అలాంటి కార్యకలాపాలపై పరిమితులు విధించడం వల్ల ఓ వ్యక్తి తన నివాస స్థలాన్ని మార్చినప్పటికీ.. డబ్బు బయటకు వెళ్లదన్నారు. ప్రస్తుతం భారతీయ పౌరుడుద ఏశం నుంచి సంవత్సరానికి 2.50లక్షల డాలర్లు మాత్రమే తీసుకువెళ్లగలడని.. ప్రవాస భారతీయుడు (NRI) మాత్రం మిలియన్ డాలర్లు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్నారు.
ఇది పెద్ద ఎత్తున మూలధనం తరలింపు లేదని నిర్ధారిస్తుందన్నారు. వ్యవస్థాపకులు, వారి వారసుల కంటే నిపుణులు దేశం విడిచి వెళ్లేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సర్వే చెబుతున్నది. 36-40 సంవత్సరాలు.. 61 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు వలస వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇక 2023 లెక్కల ప్రకారం.. అల్ట్రా రిచ్‌గా జాబితాలో 2.83లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి నికర విలువ రూ.25కోట్ల కంటే ఎక్కువ. వారి మొత్తం సంపద రూ.2.83లక్షల కోట్లుగా అంచనా. సర్వే ప్రకారం.. 2028 నాటికి ఈ సంఖ్య 4.3లక్షలకు పెరుగుతుంది. వారి సంపద రూ.359లక్షల కోట్లకు చేరనున్నది.