న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు రూ.3,500 లేదా 2.26 శాతం పడిపోయి రూ.1,51,500 వద్ద ఆగింది. కిలో వెండి విలువ కూడా రూ.9,000 లేదా 3.66 శాతం క్షీణించి రూ.2,37,000 వద్ద నిలిచింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పుత్తడి రేటు రూ.3,650 కోల్పోయి రూ.1,36,550 పలికింది. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర జూన్ డెలివరీకిగాను రూ.6,004 దిగి 24 క్యారెట్ తులం రూ.1.47,704గా నమోదైంది.