మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 02, 2021 , 01:45:57

తగ్గిన పసిడి ధర

తగ్గిన పసిడి ధర

  • ఒక్కరోజే రూ.1,300  డౌన్‌ 
  • వెండి రూ.3,500 అప్‌ 

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 1: పసిడి ధరలు భారీగా తగ్గాయి. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.1,320 తగ్గి రూ.47,500కి చేరుకున్నది. అంతకుముందు రోజు పసిడి రూ.48,800గా ఉన్నది. కానీ, వెండి భగభగమండింది. కిలో ధర ఏకంగా రూ.3,400 ఎగబాకి రూ.72 వేల పైకి చేరుకున్నది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి ధర  రూ.72,470గా ఉన్నది. శనివారం ఈ ధర రూ.69 వేలు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.49,960కి పరిమితమైంది. వెండి మాత్రం రూ.4,600 ఎగబాకి రూ.79,200 పలికింది. గడిచిన పది రోజుల్లో వెండి ఇంచుమించు రూ.9 వేలు ఎగబాకినది. 


VIDEOS

logo