శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 13, 2020 , 23:53:03

ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి కాంతులు

ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి కాంతులు

రూ.వెయ్యి పెరిగిన 10 గ్రాములు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. నిజానికి లాక్‌డౌన్‌ కారణంగా బహిరంగ మార్కెట్‌ మూసి ఉన్నప్పటికీ కరోనా భయాల మధ్య మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తుండటంతో ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో జూన్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 2 శాతానికిపైగా పెరిగి ఒకానొక దశలో 46,385ను తాకింది. చివరకు రూ.961 ఎగబాకి రూ.46,255 గా నిలిచింది. మరోవైపు మే నెలకుగాను కిలో వెండి ఫ్యూచర్స్‌ ధర 0.5 శాతం ఎగిసి రూ. 43,725ను చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,690 డాలర్లు పలుకుతున్నది. వెండి 15.21 డాలర్లుగా ఉన్నది.


logo