న్యూఢిల్లీ, మే 23:బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీలో తులం 24 క్యారెట్ పసిడి ధర రూ.350 పతనమై రూ.60,170 వద్ద స్థిరపడింది.
కిలో వెండి ధర రూ.660 కోల్పోయి రూ.72,880గా ఉన్నది. కాగా, అంతర్జాతీయ విపణిలో దిగజారుతున్న ధరలే.. దేశీయ మార్కెట్‌నూ ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.