శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 10, 2021 , 03:18:52

మళ్లీ పసిడి పరుగు

మళ్లీ పసిడి పరుగు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.500 పెరిగి మళ్లీ రూ.47 వేలు అధిగమించింది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.47,050 వద్ద నిలిచింది. కానీ, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి రూ.100 తగ్గి రూ.68,400 వద్ద నిలిచింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్లు కలిగిన తులం బంగారం ధర రూ.640 అధికమై రూ.48,710కి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.2 వేలు అధికమై రూ.75 వేలకు చేరుకున్నది. 

VIDEOS

logo