మహబూబ్నగర్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో( Parliamentary elections) మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud) వినూత్నంగా దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లు తిరుగుతూ, అందరిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్(Mahabubnagar) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas reddy)కి మద్దతుగా ప్రచారాన్ని(Campaigned) హోరిత్తిస్తున్నారు.
తాజాగా బుధవారం హన్వాడ మండలం మునిమోక్షం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. గడ్డపార పట్టి మట్టి తీశారు. ట్రాక్టర్ నడిపి అందరిని ఉత్సాహపరిచారు. కూలీలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అందరికి న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.