Gold Price | గత కొంత కాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ (Gold Price) పడింది. దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన బంగారం ధర గత కొన్ని రోజులుగా కాస్త దిగొస్తోంది. లక్ష రూపాయలు అధిగమించిన తులం పుత్తడి ధర యూ టర్న్ తీసుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే ఏకంగా తులం బంగారం రూ.2 వేలకుపైనే తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.95,880 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.87,900గా ఉంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, భువనేశ్వర్ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,730గా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.87,750గా పలుకుతోంది. దాదాపు 10 రోజుల్లో పసిడి ధర దాదాపు రూ.5వేల మేర తగ్గింది. ఇక కిలో వెండి (Silver Price) దర రూ. 99,900 పలుకుతోంది.
Also Read..
Bank Holidays | మే నెలలో 13 రోజులు మూత పడనున్న బ్యాంకులు.. పూర్తి వివరాలు ఇవే..!
New Jobs | సంస్థ మారేందుకు సై!.. వచ్చే ఏడాదికాలంలో కంపెనీలను మారనున్న మెజారిటీ ఉద్యోగులు!