Gold Demand | భారత్‌లో బంగారానికి తగ్గిన డిమాండ్.. తొలి త్రైమాసికంలో 15 శాతం డౌన్!.. ధరల పెరుగుదలే కారణం..!
Gold Demand |జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 15శాతం తగ్గి 118.1 టన్నులకు చేరింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ కాలంలో మొత్తం పెట్టుబడి విలువ 22శాతం పెరిగి రూ.94,030 కోట్లకు చేరుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Gold Demand |జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 15శాతం తగ్గి 118.1 టన్నులకు చేరింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ కాలంలో మొత్తం పెట్టుబడి విలువ 22శాతం పెరిగి రూ.94,030 కోట్లకు చేరుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం.. 2025లో భారత్‌లో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉంటుందని అంచనా. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధరలు 25శాతం పెరిగాయి. ఒక దశలో తులం బంగారం రూ.లక్ష వరకు చేరింది. ధరల పెరుగుదల మార్కెట్లో వినియోగదారులను భారీగా ప్రభావితం చేసింది. భారీగా పెరిగిన ధరల కారణంగా కొనుగోలు సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ బంగారం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇది కొనుగోలు సెంటిమెంట్‌కు సహాయపడుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సచిన్ జైన్ త్రైమాసిక నివేదికలో పేర్కొన్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. భారత్‌లో అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. దాంతో బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. రికార్డుస్థాయిలో బంగారం ధరలు పెరగ్గా.. చాలామంది తగ్గుతాయనే ఆశలో పసిడి కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం ధర స్థిరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత బంగారం ధరల నేపథ్యంలో చాలామంది జాగ్రత్తగా ఉన్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ నేపథ్యంలో అమ్మకాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, పెట్టుబడుల విషయం డిమాండ్ బలంగానే ఉన్నది. ఈ కాలంలో 43.6 టన్నుల నుంచి 7శాతం పెరిగి 46.7 టన్నులకు చేరింది. దానికి తోడు మార్కెట్లో అనిశ్చితి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. గోల్డ్ బార్స్, నాణేలకు డిమాండ్ ఉన్నది.
2025 క్యాలెండర్ తొలి త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 25శాతం తగ్గి 71.4 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో 95.5 టన్నులుగా ఉన్నది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. 2020 తర్వాత ఈ ఏడాది డిమాండ్ అత్పల్పంగా ఉన్నది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులకు చేరాయి. అయితే వినియోగదారులు రికార్డు ధరలు ఉన్నప్పటికీ బంగారం రీసైక్లింగ్ 32 శాతం తగ్గి 26 టన్నులకు చేరుకుంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో పది గ్రాముల బంగారం సగటు త్రైమాసిక ధర రూ.79,633.4 ఉండగా.. 2024 తొలి త్రైమాసికంలో రూ.55,247 పలికింది. మరో వైపు 2025 జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రపంచ బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులకు చేరుకుంది. 2019 తర్వాత తొలి త్రైమాసికంలో భారీగా డిమాండ్ ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

