Bank Holidays | మే నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. ముందస్తుగా సమాచారం లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని మే నెలలో బ్యాంకులు రెండువారాలకుపైగా మూతపడనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ సేవలు నిరంతరాయంగా పని చేయనున్నాయి. వాటి సహాయంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. క్యాష్‌ని విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పలు బ్యాంకులు సైతం క్యాష్ డిపాజిట్ మెషిన్స్ సైతం అందుబాటులో ఉంచాయి. వీటితో అకౌంట్లో డబ్బులు వేసుకునే సౌలభ్యం ఉంది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలున్నది.
మే 1 : కార్మిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
మే 4 : ఆదివారం సందర్భంగా హాలీడే.
మే 9 : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా హాలీడే.
మే 10 : రెండోశనివారం సందర్భంగా సెలవు.
మే 11 : ఆదివారం సందర్భంగా హాలీడే.
మే 12 : బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు, తెలంగాణలో ఆప్షనల్ హాలీడే.
మే 16 : శుక్రవారం సందర్భంగా సిక్కింలో సెలవు.
మే 18 : ఆదివారం సందర్భంగా సెలవు.
మే 24 : నాలుగో శనివారం సందర్భంగా సెలవు.
మే 25 : ఆదివారం కావడంతో హాలీడే.
మే 26 : ఖాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు సందర్భంగా సిక్కింలో హాలీడే.
మే 29 : మహారాణా ప్రతాప్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవులు.
మే 30 : గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.