న్యూఢిల్లీ, ఆగస్టు 10: బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.
కిలో వెండి రూ.300 దిగి రూ.73,300కి దిగొచ్చింది. ఇటు హైదరాబాద్‌లోనూ 22 క్యారెట్ తులం ధర రూ.250 తగ్గి రూ.54,700కి తగ్గగా, 24 క్యారెట్ ధర రూ.280 దిగి రూ.59,670కి తగ్గింది.