Gold Prices | కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై రూ.1,440 తగ్గింది. దీంతో హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,050 తగ్గి రూ.1,14,100కి చేరింది.
అటు వెండి (Silver) ధరలు కూడా బంగారంతో సమానంగా దిగొచ్చాయి. పది రోజుల కిందట కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరువైన విషయం తెలిసిందే. ఇప్పుడు కిలో వెండి రూ.1.50 లక్షల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్ బలపడుతుండటంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, పది రోజుల క్రితం తులం బంగారం ఎన్నడూ లేని విధంగా రూ.1.35 లక్షలు దాటిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు పుత్తడి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Donkey Route | డంకీ రూట్లో ప్రవేశం.. 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా
Actor Vijay | నెల రోజుల తర్వాత.. కరూర్ బాధితులను కలిసిన విజయ్