Donkey Route | డంకీ రూట్లో ప్రవేశం.. 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా
Donkey Route | అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Donkey Route | అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వలసలు ఆగడం లేదు. డంకీ మార్గం (Donkey Route)లో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అమెరికా తాజాగా వెనక్కిపంపింది. అందులో అత్యధికంగా హర్యాణా (Haryana) వాసులే కావడం గమనార్హం.
16 మంది కర్నాల్ యువకులు కాగా, 15 మంది కైతాల్‌కు చెందిన వారు. అంబాలా (5), యమునా నగర్ (4), కురుక్షేత్ర (4), జింద్ (3), సోనిపట్ (2), పంచకుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వారంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. బహిష్కరణకు గురైన వారు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే నని చెప్పారు. వారందరినీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా అక్రమమార్గమైన డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు. కాగా, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపుతున్నారు. ఈ ఏడాది వేల సంఖ్యలో అక్రమవలసదారులను దేశం నుంచి బహిష్కరించారు.
Also Read..
US airports | షట్‌డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
US Navy Chopper | నిమిషాల వ్యవధిలోనే.. సముద్రంలో కూలిన యూఎస్ నేవీ చాపర్, ఫైటర్ జెట్
Indian woman | యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

