US Navy Chopper | అమెరికాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికా నేవీ చాపర్ (US Navy Chopper), ఫైటర్ జెట్ దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో కూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెండూ ప్రమాదానికి గురయ్యాయి. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటగా 2:45 గంటల ప్రాంతంలో ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ (MH-60R Sea Hawk helicopter) దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత అర గంట వ్యవధిలోనే అంటే.. 3:15కు బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ (F/A-18F Super Hornet fighter jet) కూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్లో ఇద్దరు ఉన్నారు. వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Actor Vijay | నెల రోజుల తర్వాత.. కరూర్ బాధితులను కలిసిన విజయ్
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్య
Indian woman | యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం