Actor Vijay | తమిళనాడు కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను విజయ్ నేడు కలిశారు.
మహాబలిపురం (Mahabalipuram)లోని ఓ రిసార్ట్‌లో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. మృతులకు చెందిన 37 కుటుంబాలతో సహా 200 మందితో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కోసం టీవీకే దాదాపు 50 రూమ్స్‌ను బుక్ చేసింది. కరూర్తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు తరలించారు. అక్కడ వారితో విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతీ కుటుంబం నుంచి నాలుగు నుండి ఐదుగురు వ్యక్తులు విజయ్ను కలవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరినీ విజయ్ వ్యక్తిగతంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ భేటీకి మీడియా సహా ఇతరులను అనుమతించలేదు.
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. గత నెల 27న కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇక మృతుల కుటుంబాలకు టీవీకే ఆర్థిక సాయంగా రూ.20 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.
#WATCH | Mahabalipuram, Tamil Nadu | Tamilaga Vetri Kazhagam (TVK) leaders arrive at the hotel to meet the family members of those who died in the Karur stampede on 27 September.
TVK chief and Actor Vijay will meet the family members of those who died in the Karur stampede… pic.twitter.com/XXYWYUmT9F
— ANI (@ANI) October 27, 2025
Also Read..
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్య
Indian woman | యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం