US airports | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ షట్‌డౌన్ (America shutdown)తో వేల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ షట్‌డౌన్‌తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. ఇది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. పలు విమానాశ్రయాల్లో (US airports) దాదాపు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలు రద్దైనట్లు తెలిసింది.
ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) కారణంగా చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరుకావడంలేదు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడింది (staffing shortage). లాస్ఏంజిల్స్, కాలిఫోర్నియా, చికాగో, వాషింగ్టన్, న్యూజెర్సీలోని నెవార్క్ తదితర ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆదివారం తెలిపింది. ఫలితంగా దాదాపు 8వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రవాణా మంత్రి శాన్ డఫీ వెల్లడించారు. దీంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read..
US Navy Chopper | నిమిషాల వ్యవధిలోనే.. సముద్రంలో కూలిన యూఎస్ నేవీ చాపర్, ఫైటర్ జెట్
Indian woman | యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం
America Visa | కఠినంగా వీసా స్టే రూల్స్.. అమెరికా చదువులకు మరిన్ని కష్టాలు!