హైదరాబాద్, జనవరి 28 : జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. అక్టోబర్-డిసెంబర్లో రూ.202 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఆదాయం రూ.1,738 కోట్ల నుంచి రూ.2,081 కోట్లకు పెరిగింది.