నైపుణ్యంతోనే ఉద్యోగాలు
నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు.
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో రాజన్ పలు సూచనలు చేశారు. రాజన్తోపాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానాల మీద ఆధారపడే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్న రాజన్.. స్టార్టప్లను ఎకువగా ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని గుర్తుచేశారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చునని ఆయన సూచించడం గమనార్హం. కాగా, పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిలబస్లో ఏఐ ఉపయోగంపై కమిటీ ఏర్పాటు చేస్తామని.. తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజన్ను కోరారు. అయితే సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికి మేలే జరుగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 3-4 నెలల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తానన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

