మంగళవారం 20 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:28:37

తగ్గిన విదేశీ మారకం నిల్వలు

తగ్గిన విదేశీ మారకం నిల్వలు

ముంబై: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న విదేశీ మారకం నిల్వలకు బ్రేక్‌పడింది.  ఈ నెల 4తో  ముగిసిన వారాంతానికి 542.013 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఫారెక్స్‌ రిజర్వులు ఆ మరుసటి వారాంతానికి 541.660 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. నికరంగా 353 మిలియన్‌ డాలర్లు తగ్గినట్లు అయింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 841 మిలియన్‌ డాలర్లు తగ్గి 497.521 బిలియన్‌ డాలర్లకు తరిగిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. కానీ పసిడి రిజర్వులు 499 మిలియన్‌ డాలర్లు పెరిగి 38.02 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం విశేషం.


logo