Flipkart | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) శుభవార్త చెప్పింది. రానున్న పండుగ సీజన్ (festive season)ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. తన వార్షిక మెగా సేల్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ (The Big Billion Days) కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షలకు పైగా తాత్కాలిక (seasonal job opportunities) ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది.
పండుగల సీజన్ వస్తోంది. ఆగస్టు 27న వినాయక చవితి, సెప్టెంబరు 22 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దసరా, దీపావళి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఏటా పండుగల సీజన్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. పండుగ సీజన్లో తక్కువ ధరకే పలు వస్తువులను సేల్కు పెడుతుంది. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి. వాటిని కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు మానవ వనరులు అవసరం ఏర్పడుతుంది.
అందుకోసం ఏటా పండుగల సీజన్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా దాదాపు 28 రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 2.2 లక్షల సీజనల్ ఉద్యోగఅవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొంది.
కంపెనీ ప్రకారం.. ఈ నియామకాలు ప్రధానంగా సప్లైచైన్, లాజిస్టిక్స్, లాస్ట్-మైల్ డెలివరీ వంటి విభాగాల్లో ఉండనున్నాయి. మొత్తం నియామకాల్లో 15 శాతం మంది మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే. ప్యాకర్స్, పికర్స్, సార్టర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం నియామకాలు జరగనున్నాయి. గతేడాదితో పోలిస్తే మహిళలు, వికలాంగులు (పీడబ్ల్యూడీ), ఎల్జీబీటీక్యూఐఏ వర్గాల వారికి అధికంగా అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ తన ప్రకటనలో వివరించింది.
Also Read..
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Parineeti Chopra | తల్లి కాబోతున్న స్టార్ నటి.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్
Duduma Waterfall | రీల్స్ చేస్తూ.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్.. VIDEO