Vehicle’s Insurance | వాహనదారులకు గుడ్‌న్యూస్.. వెహికిల్ ఇన్సూరెన్స్‌లపై హైకోర్టు సంచలన తీర్పు
Vehicle's Insurance | వచ్చే నెల నుంచి మోటారు సైకిళ్లు మొదలు కార్లు.. ట్రక్కులు ఇతర వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. వాహన బీమాపై మద్రాస్....

Vehicle’s Insurance | వచ్చే నెల నుంచి మోటారు సైకిళ్లు మొదలు కార్లు.. ట్రక్కులు ఇతర వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. వాహన బీమాపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని వాహనాలపైనా ఐదేండ్ల బంపర్ టు బంపర్ బీమా తప్పనిసరి అమలు చేయాలని ఆదేశించింది. కారు డ్రైవర్‌తోపాటు యజమాని, ఇతర ప్రయాణికులకు తప్పనిసరి కవరేజీనివ్వాలని ఐదేండ్ల పాటు జస్టిస్ ఎస్ వైద్యనాథన్ సారధ్యంలోని బెంచ్ గురువారం తీర్పు చెప్పింది.
వాహన ఓనర్లు మరింత అలర్ట్‌గా ఉండాలి
వాహన యజమాని తనతోపాటు డ్రైవర్, ప్యాసింజర్లు, థర్డ్ పార్టీల ప్రయోజనాల పరిరక్షణ పట్ల తప్పనిసరిగా మరింత ఆచితూచి వ్యవహరించాలని పేర్కొంది. వాహన యజమానిపై అనవసర భారాన్ని నివారించాల్సి ఉందని తెలిపింది. వాహనంలో ప్రయాణించే వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఇతరులకు మాత్రమే బీమా కవరేజీ కల్పిస్తున్నారని థర్డ్ పార్టీ బీమా సంస్థలను మందలించింది.

వాహనంపై భారీ ఖర్చు సరే.. బీమా పట్టదా..
‘ఒక వాహనాన్ని కొనుగోలు చేయడానికి సదరు వ్యక్తి భారీ మొత్తంలో చెల్లించడానికి సిద్ధం. కానీ తనతోపాటు ఇతరుల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకునే బీమా పాలసీ కోసం కొద్ది మొత్తం చెల్లించడానికి ఆసక్తి చూపకపోవడం నిజంగా దిగ్బ్రాంతికరం’ అని జస్టిస్ వైద్యనాథన్ పేర్కొన్నారు. వాహన బీమా పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు బీమా సంస్థలు ఆ వ్యక్తికి దాని షరతులు, ప్రాముఖ్యత వివరించకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. వాహన కొనుగోలుదారు కూడా సదరు బీమా పాలసీ షరతులను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. వారు వెహికల్ పెర్ఫార్మెన్స్ గురించి చూస్తారే తప్ప బీమా పాలసీకి ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నారు.
ఓ బాధిత కుటుంబానికి అనుకూలంగా ఇలా..
రోడ్డు ప్రమాదంలో బాధితులైన ఓ కుటుంబానికి రూ.14 లక్షలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని పక్కనబెట్టి రూ.14.65 లక్షల పరిహారం చెల్లించాలని న్యూ ఇండియా అస్సూరెన్స్ కో లిమిటెడ్‌ను ఆదేశించింది. థర్డ్ పార్టీ బీమా కవరేజీ కేవలం వాహనం డ్యామేజీ, యజమానికి గాయాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారని న్యాయస్థానం ఆక్షేపించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- vehicle insurance
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

