Union Budget 2023-24 Highlights | వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది ఐదోసారి. మరి ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
☞ ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు చూస్తోంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.
☞ కళాకారుల బ్రాండ్ ప్రమోషన్‌కు చర్యలు తీసుకుంటున్నాం. కళాకారులు, హస్తకళాకారులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం. ఎంఎస్ఎంఈలతో కళాకారులను అనుసంధానం చేస్తున్నాం.
☞ టూరిజం రంగంలో భారత్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగ ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేపట్టాం. హరిత ఇంధనం కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాం.
☞ సప్తరుషుల రీతిలో బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత. సమిష్ఠి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం.
☞ వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెట్ సదుపాయం అందిస్తున్నాం.
☞ వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం.
☞పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం.
☞ చిరుధాన్యాలు ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. చిరుధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జొన్న, రాగి, బార్లీ, ఇలా ఎన్నో సిరిధాన్యాలు పండిస్తున్నాం.
☞ సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
☞ మత్యకారుల కోసం రూ.6వేల కోట్లు
☞ 11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. మహిళల కోసం మరిన్ని పథకాలు అమలు చేశాం. 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తాం. పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం.
☞ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయుత అందిస్తాం. ప్రైవేటు ప్రభుత్వ పరిశోధనల కోసం ICMR ల్యాబ్స్ ఏర్పాటు
☞ పంచాయతీ స్థాయిలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిపెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు అందజేస్తాం.
☞ ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం
☞ PVTG గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు కేటాయించాం.
☞ కర్ణాటకలోని కరవు పీడిత ప్రాంతాలకు రూ. 5వేల కోట్లు
☞ పీఎం ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లు
☞ పురాతన తాళపాత్రల డిజిటలైజేషన్ కోసం ప్రత్యే చర్యలు.
☞ దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నాం. సహకార సంఘానికి బడ్జెట్లో పెద్ద పీట. పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
☞ 81 లక్షల సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు చేయూత. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ కోసం రూ.2వేల కోట్లు- మెడికల్ కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
☞ ఎస్సీ వర్గాలకు రూ.15వేల కోట్లు కేటాయింపు
☞ రైల్వేకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు
☞ రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
☞ మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం నిధులు. మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు
☞ పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం
☞ డిజిటల్ సిస్టమ్స్ కోసం గుర్తింపు ఆధారంగా ఇక PAN . ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్
☞ గతంలో కట్టిన బిడ్స్ మొత్తం ఎంఎస్ఎంఈలకు తిరిగి చెల్లిస్తాం.
☞ ఎంఎస్ఎంఈ, పెద్ద సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కోసం డిజిలాకర్ వ్యవస్థ
☞ 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
☞ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
☞ మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
☞ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం. స్టార్టప్‌లకు రిస్క్ తగ్గించేందుకు కృషి
☞ KYC ప్రక్రియ సులభతరం చేయాలని నిర్ణయం
☞ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధుల కేటాయింపు.
☞ కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, సాగు రంగానికి రూ.5300 కోట్లు
☞ నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్ల కేటాయింపు
☞ విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్ల కేటాయింపు
☞ నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభం
☞ పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ. మూడేళ్ల పాటు 47 లక్షల మంది యూత్‌కు స్టైఫండ్
☞ పర్యాటకరంగ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు. ఛాలెంజ్ విధానంలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల ఎంపిక.. 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
☞ దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
☞ స్వదేశ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
☞ మహిళల కోసం అధిక వడ్డీతో ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ప్రారంభం.
☞ రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు. మూల ధన వ్యయం పెంచేందుకు రాష్ట్రాలకు చేయూత
☞ రోడ్లు, రహదారుల నిర్మాణానికి రూ.75వేల కోట్ల కేటాయింపు
☞ పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 23 శాతం నుంచి 13 శాతానికి తగ్గించాం. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ, టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గించాం. కిచెన్ చిమ్నీలు, వజ్రాల ధరలు తగ్గుతాయి.
☞ విదేశాల నుంచి దిగుమతి సుంకం పెరగడంతో టైర్లు, రబ్బర్, సిగరెట్లు, బ్రాండెడ్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.
— ఇన్‌కం ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు
– ఆదాయపు పన్ను మినహాయింపు రూ.5 నుంచి 7 లక్షల వరకు పెంపు
– ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్నులు ఉంటాయి.
– రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను
– రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం
– రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం
– రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
– రూ.15 లక్షలకు పై ఉంటే 30 శాతం పన్ను
– 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను
Nirmala Sitharaman | ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్ వస్త్రధారణ..!
Nirmala Sitharaman : వరుసగా అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రి..
Union Budget 2023-24 లైవ్ అప్డేట్స్