Nirmala Sitharaman : వరుసగా అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రి..
Nirmala Sitharaman: వరుసగా అయిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మల. గతంలో ఈ రికార్డును నెలకొల్పిన వారిలో మన్మోహన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్, జైట్లీ, యశ్వంత్ ఉన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం ఉన్నారు.
2019 నుంచి నిర్మల వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్‌లు అయిదుసార్లు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టిన వారి జాబితాలో ఉన్నారు. 2014లో నిర్మల తొలిసారి మోదీ క్యాబినెట్లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జైట్లీ 2014 నుంచి 2018 వరకు జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2018-19లో ఆరోగ్య సరిగా లేని కారణంగా జైట్లీ బదులుగా పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో తొలిసారి సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1971లో ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా నిర్మల నిలిచారు.
యూపీఏ పాలనలో చిదంబరం వరుసగా 2004-05 నుంచి 2008-09 వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యశ్వంత్ సిన్హా 1998-99లో తొలిసారి, ఆ తర్వాత 1999-2000 నుంచి 2002-03 వరకు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సిన్హా సమయంలోనే బడ్జెట్‌ను సాయంత్రం 5 నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.
నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-92 నుంచి 1995-96 మధ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

