జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. ప్రకాశం రోడ్డుకు చెందిన అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మీ బుధవారం ఉదయం హత్యకు గురైంది. ఆమె భర్త నరేష్ భార్యపై అనుమానంతో మెడకు తువ్వాలు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.
భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో లక్ష్మీ తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితం నరేష్ భార్యను ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం లక్ష్మీ హత్యకు గురైంది. నరేష్ ఆమె మెడకు తువ్వాలు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.