మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తాండ శివారులో చిరుత పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి లంబడి రాజు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఉన్న లేగ దూడపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో లేగ దూడ మృతి చెందింది.
చిరుత దాడి విషయం తెలియడంతో తాండవాసులు ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ పొలాల వైపు వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.