Chillara Song | ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘చిల్లర సాంగ్’ విడుదల.. లాంచ్ చేసిన చంద్రహాస్!
Attitude Star Chandrahas | తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాల్లో ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu) ఒకటి.
Attitude Star Chandrahas | తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాల్లో ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu) ఒకటి. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్గా అలరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ సంగీత ప్రమోషన్స్‌లో భాగంగా మరో క్రేజీ అప్డేట్తో ముందుకు వచ్చారు.
యువ నటుడు, ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ (Attitude Star Chandrahas) చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘చిల్లర సాంగ్’ (Chillara Song) లిరికల్ వీడియోను ఘనంగా విడుదల చేశారు. సాంగ్ లాంచ్ అనంతరం చిత్ర యూనిట్‌కు చంద్రహాస్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.
ఈ పాటకు సంబంధించిన విశేషాలకు వస్తే.. ఎస్. సుహాస్ ఈ పాటకి అద్భుతమైన సాహిత్యాన్ని అందించడమే కాకుండా, స్వయంగా ఆలపించి సంగీతం సమకూర్చడం విశేషం. గణేష్ బొడ్డ, ఎస్. సుహాస్ సంయుక్తంగా అందించిన ఈ పాటలోని లైన్స్ చాలా క్యాచీగా మరియు యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. లిరికల్ వీడియోలో ముగ్గురు హీరోల సరదా చిల్లింగ్ మూమెంట్స్, రిథమిక్ బీట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాజ్ నోముల, ఎడిటర్‌గా జమీర్ షేక్ వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ వాల్యూస్‌తో పాటు వినోదాత్మక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా పేరు ముగ్గురు కోతులు (Mugguru Kothulu) కాగా, సమర్పణ జీఎస్ఆర్ క్రియేషన్స్ (GSR Creations) మరియు సహ సమర్పణ స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ (Sky Flare Networks) అందిస్తున్నాయి. నిర్మాతగా శోభారాణి గరిమెల్ల (Sobharani Garimella) వ్యవహరిస్తుండగా, దర్శకుడిగా కార్తీక్ గరిమెల్ల (Karthik Garimella) తెరకెక్కిస్తున్నారు. సంగీతం & సాహిత్యం ఎస్. సుహాస్ (S. Suhas) అందించగా, తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం నటీనటులుగా నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

