శనివారం 15 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 00:12:52

రెడ్డీస్‌పై అమెరికాలో దావా

రెడ్డీస్‌పై అమెరికాలో దావా

హైదరాబాద్‌, జూన్‌ 26: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌పై అమెరికా కోర్టులో దావా వేసింది మెర్క్‌ షార్ప్‌ అండ్‌ దోహమ్‌ కార్పొరేషన్‌. జానువియా, జానమెట్‌ ఔషధాలకు ప్రత్నామ్నాయంగా జనరిక్‌ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న రెడ్డీస్‌పై మెర్క్‌ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దీనికి వ్యతిరేకంగా అమెరికా జిల్లా కోర్టులో పేటెంట్‌ ఇంఫ్రిగ్‌మెంట్‌ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. టైప్‌ 2 డయబేటిస్‌, బ్లడ్‌ షుగర్‌ వ్యాధులను ఈ రెండు ఔషధాల ద్వారా నియంత్రించవచ్చును. అంతర్జాతీయంగా ఈ రెండు మందులకు 5.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉండగా, అదే అమెరికాలోనే 2.3 బిలియన్‌ డాలర్లు ఉన్నది.


logo