NIMZ | నిమ్జ్‌లో పారిశ్రామిక సందడి.. ఫలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రూపుదిద్దుకుంటున్న ‘జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్)’లో పరిశ్రమల స్థాపన మొదలైంది.
- ఇప్పటికే ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలు
- కొత్తగా ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆహారశుద్ధి, క్రీడలు, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లు ఏర్పాటుకు ప్రణాళికలు
- పూర్తికావొచ్చిన నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం
- పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు
- దేశ, విదేశీ కంపెనీలతో కేసీఆర్ సర్కార్ ఒప్పందాలు
- జహీరాబాద్ పారిశ్రామికాభివృద్ధికి అడుగులు
- సుమారు 2.66 మందికి ఉద్యోగాలు, ఉపాధి
NIMZ | జహీరాబాద్, జనవరి 8: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రూపుదిద్దుకుంటున్న ‘జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్)’లో పరిశ్రమల స్థాపన మొదలైంది. వెనుకబడిన జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం నిమ్జ్‌కు రూపకల్పన చేసింది. ఈ రెండు మండలాల్లోని 17 గ్రామాలు, 12,635 ఎకరాల్లో నిమ్జ్‌ను నెలకొల్పడం, రూ.31 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, సుమారు 2.66 లక్షల మందికి ప్రత్యకంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించడమే కాకుండా పలు పరిశ్రమలకు భూములు కేటాయించింది.
దీంతో అక్కడ పరిశ్రమల స్థాపనకు పలువురు దేశ విదేశీ వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన పారిశ్రామిక సమీక్షలో సైతం జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం విశేషం. పారిశ్రామిక అభివృద్ధికి మాస్టర్ పాలసీ రూపొందించాలని కూడా ఆధికారులను ఆదేశించారు. జహీరాబాద్‌లో కొత్తగా ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆహారశుద్ధి, క్రీడలు, ఆర్గానిక్ క్లస్టర్లు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేసే పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామిక ఖిల్లాగా నిమ్జ్
ఒప్పందం చేసుకున్న ప్రకారం అన్ని సంస్థలూ తమ పరిశ్రమలను స్థాపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే, రానున్న రోజుల్లో నిమ్జ్ పారిశ్రామిక ఖిల్లాగా మారనున్నది. ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయి, స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భూముల ధరలు మరింతగా పెరగనున్నాయి. నిమ్జ్‌కు రాకపోకలు సాగించేందుకు ఎన్‌హెచ్-65 ఉగ్గెళ్లి చౌరస్తా నుంచి నిమ్జ్ ఏర్పాటు చేస్తున్న ఎల్గోయి శివారు వరకు రూ.100 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కొన్ని సంస్థలు
- ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్‌కు 150 ఎకరాలు భూమిని కేటాయించగా, రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. 25 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- జర్మనీకి చెందిన లైట్ ఆటో సంస్థకు 100 ఎకరాల భూమిని కేటాయించగా, ఆ సంస్థ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. ఇ సంస్థ వాహన విడిభాగాలు, ముడి పదార్థాల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పనున్నది. తద్వారా ప్రత్యక్షంగా 9 వేల మందికి, పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
- ఏరో స్పేస్ రంగానికి చెందిన వెమ్ టెక్నాలజీస్ సంస్థకు 511 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ రూ.1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నది. ఈ పరిశ్రమ అధునాతన రక్షణ సామగ్రి, ఏరోస్పేస్, ఏరోనాటిక్స్, అంతరిక్ష రంగాల్లో ఉపయోగపడే పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఏరో స్ట్రక్చర్స్, ఏరో ఇంజిన్స్ రాడార్, సిస్టమ్స్, హెలిక్యాప్టర్లు, విమానాలకు సంబంధించిన పరికరాలు ఉత్పత్తి చేస్తారు. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2022 జూన్ 22న నిమ్జ్‌లో వెమ్ టెక్నాజీస్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వెమ్ టెక్నాలజీస్ పనులు ప్రారంభించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

