Meta | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) కు భారీ షాక్ తగిలింది. నిబంధనలను అతిక్రమిస్తూ యూరప్ దేశాల యూజర్ల డేటాను అమెరికా (US)కు బదిలీ చేసిందని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్ (European Union) అనుబంధ సంస్థ ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ( Data Protection Commission ) మెటాకు భారీ జరిమానా (record fine) విధించింది. మొత్తం 1.3 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.10,000 కోట్లు అన్నమాట.
యూజర్ల డేటా భద్రత విషయంలో ప్రాథమిక హక్కులను హరించి వేసేలా మెటా వ్యవహరించిందని డీపీసీ ఆరోపించింది. యూజర్ల డేటాకు ఉన్న ముప్పును తొలగించడంలో మెటా విఫలమైందని పేర్కొంది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలను కూడా మెటా పట్టించుకోలేదని డీపీసీ వెల్లడించింది. ఐరోపా వినియోగదారుల డేటాను అమెరికాకు బదిల చేయడం అక్టోబరు కల్లా నిలిపివేయాలని తెలిపింది.
Also Read..
Bengaluru Rains | వరదపాలైన రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు!
Sudha Murthy | 30 ఏళ్లుగా ఒక్క వెకేషన్కు కూడా వెళ్లలేదు : సుధామూర్తి
Virat Kohli | మరింత దృఢంగా తిరిగొస్తాం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిష్క్రమణపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్